కుకీ పాలసీ
మా వెబ్‌సైట్‌లు మరియ ఇతర ఆన్‌లైన్ సర్వీసులపై (కుకీలను ఉపయోగించే అప్లికేషన్‌లు, పోర్టల్‌లు లేదా ఇతర సేవలు) స్టాండర్డ్ ఛార్టర్డ్ గ్రూప్ (“మేము” లేదా “మా”) ఉపయోగించే పిక్సెల్‌లు, బీకాన్‌లు, మరియు ట్యాగ్‌ల (అన్నీ కలిసి “కుకీలు”) వంటి సారూప్య సాంకేతికతలు మరియు కుకీలను ఈ కుకీ పాలసీ వివరిస్తుంది.
కుకీలు అంటే ఏమిటి మరియు మేం వాటిని ఎందుకు ఉపయోగిస్తాము?
కుకీలు మా వెబ్‌సైట్‌ల ద్వారా మీ బ్రౌజర్ మెమరీలో నిల్వ చేయబడే చిన్న టెక్స్ట్ ఫైల్‌లు. ఇవి సాధారణంగా మా వెబ్‌సైట్‌లపై వివిధ ఫంక్షన్‌లకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడతాయి.
కుకీలు ఇతర ఉపయోగకరమైన పనులకు కూడా చేస్తాయి, వీటిలో మీరు ఏ పేజీలను ఎక్కువగా సందర్శిస్తారో మాకు చెబుతాయి, మా వెబ్‌సైట్‌లు మీకు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో అర్ధం చేసుకుంటాయి, మరియు మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీతో మా కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి.
మిమ్మల్ని వ్యక్తిగతంగా నేరుగా గుర్తించే సమాచారాన్ని సేకరించడానికి మేము కుకీలను ఉపయోగించము. అయితే, కుకీలు సేకరించే కొంత సమాచారం వ్యక్తిగత డేటాగా పరిగణించబడవచ్చు (మీ బ్రౌజింగ్ చరిత్ర, లేదా మీ పరికర సమాచారం వంటివి).
కుకీలు చేయవలసిన పని పై ఆధారపడి, అది సెషన్ లేదా పర్సిస్టెంట్ కుకీ కావచ్చు:
- కుకీ దాని గడువు తేదీని చేరుకున్నప్పుడు మీరు లేదా మీ బ్రౌజర్ దానిని తొలగించే వరకు పర్సిస్టెంట్ కుకీలు మీ పరికరం పై నిలిచి ఉండవచ్చు.
- సెషన్ కుకీలు తాత్కాలికమైనవి మరియు మీరు బ్రౌజర్‌ను మూసినప్పుడు లేదా మీ సెషన్ ముగిసినప్పుడు వాటి గడువు ముగుస్తుంది.
మేము ఏ రకం కుకీలను ఉపయోగిస్తాము?
మేము మా వెబ్‌సైట్‌లలో ఎలాంటి కుకీలను అమలు చేస్తాము అనేది మీరు మెరుగ్గా అర్ధం చేసుకోవడంలో సహాయపడటానికి, మేము మా కుకీలను నాలుగు విభాగాలుగా వర్గీకరించాము: స్ట్రిక్ట్‌లీ నెససరీ, పర్ఫార్మెన్స్, ఫంక్షనల్ మరియు అడ్వర్టైజింగ్.
విభాగం 1: స్ట్రిక్ట్‌లీ నెససరీ
ఈ కుకీలు మా వెబ్‌సైట్ పని చేయడానికి, మీ బ్రౌజింగ్ అనుభవానికి కీలకం మరియు ప్రామాణీకరణను ప్రారంభించడానికి మరియు భద్రత కోసం కూడా ఇవి ఉపయోగించబడతాయి.
ఈ కుకీలు సేకరించిన సమాచారాన్ని మేము ఈ క్రింది వాటి కోసం ఉపయోగిస్తాము:
- మా వెబ్‌సైట్‌లు సరిగ్గా పని చేస్తున్నాయని మరియు మీకు విశ్వసనీయంగా కంటెంట్‌ను అందిస్తున్నాయని పర్యవేక్షించడానికి;
- అవసరమైతే, తిరిగి ఎంటర్ చేయడం నివారించడానికి మీ సమాచారాన్ని అన్ని పేజీలలో గుర్తించుకోవడానికి
స్ట్రిక్ట్‌లీ నెససరీ కుకీలు మా వెబ్‌సైట్ పని చేయడం కోసం అవసరం కాబట్టి, మా వైపు నుంచి వాటిని నిలిపివేయలేము. మీరు ఈ కుకీలను బ్లాక్ చేసేలా లేదా వీటి గురించి మిమ్మల్ని హెచ్చరించేలా మీ బ్రౌజర్‌ను సెట్ చేయవచ్చు కానీ వాటిని తిరస్కరించడం వలన మా వెబ్‌సైట్‌లలో కొన్ని భాగాలు పని చేయకపోవచ్చు.
విభాగం 2: పర్ఫార్మెన్స్ కుకీలు
మీరు మా వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగిస్తారు అనే సమాచారాన్ని ఈ కుకీలు సేకరిస్తాయి. ఉదాహరణకు, మేము ఏ పేజీలను సందర్శించారు మరియు మీ సందర్శన సమయంలో మీకు ఏవైనా లోపాలు ఎదురయ్యాయా వంటివి. వెబ్‌సైట్ అనలిటిక్స్ నిర్వహించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఈ కుకీల ద్వారా సేకరించిన డేటా ఒక అగ్రిగేట్ ఫారమ్‌లో నిల్వ చేయబడుతుంది మరియు ఒక వ్యక్తిగా, నేరుగా మిమ్మల్ని గుర్తించదు.
ఈ కుకీలు సేకరించే సమాచారాన్ని మేము ఈ క్రింది వాటి కోసం ఉపయోగిస్తాము:
- మీ వెబ్‌సైట్ ఎలా ఉపయోగించబడుతుంది మరియు మా ప్రచారాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో అర్ధం చేసుకునేందుకు
- మేము మెరుగుదలలను చేయగలిగేలా మా వెబ్‌సైట్‌ల వివిధ వర్షన్‌లను పరీక్షించడానికి
మీరు మీ బ్రౌజర్‌లో ఈ కుకీలను పరిమితం చేస్తే, మా వెబ్‌సైట్‌ల పై మీ బ్రౌజింగ్ అనుభవం ప్రభావితం కావచ్చు.
విభాగం 3: ఫంక్షనాలిటీ కుకీలు
మా వెబ్‌సైట్‌కు మీ సందర్శనను మెరుగుపరచడానికి, ఉత్తమంగా చేయడానికి మరియు వ్యక్తిగతీకరించడానికి ఈ కుకీలు మిమ్మల్ని గుర్తు ఉంచుకుంటాయి.
ఈ కుకీలు సేకరించే సమాచారాన్ని మేము క్రింది వాటికి ఉపయోగిస్తాము:
- మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా మా వెబ్‌సైట్ కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడానికి
- వీడియోను చూసే సామర్ధ్యంతో సహా, మీకు వివిధ వెబ్ సేవలను అందించడానికి
మీరు మీ బ్రౌజర్ పై ఈ కుకీలను పరిమితం చేస్తే, మీరు ఇంతకు ముందు చేసిన ఎంపికలను మా వెబ్‌సైట్ గుర్తించుకోలేదు లేదా మీ బ్రౌజింగ్ అనుభవాన్ని వ్యక్తిగతీకరించదు.
విభాగం 4: అడ్వర్టైజింగ్ కుకీలు
మా మార్కెటింగ్‌ను మీకు మరియు మీ ఆసక్తులకు అనుగుణంగా రూపొందించడానికి మా వెబ్‌సైట్‌ను మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మేము లేదా మా మూడవ-పక్ష భాగస్వాములు అడ్వర్టైజింగ్ కుకీలను మీ బ్రౌజర్‌లో ఉంచవచ్చు.
అడ్వర్టైజింగ్ కుకీలు మిమ్మల్ని నేరుగా గుర్తించడానికి ఉపయోగించబడవు. మా వెబ్‌సైట్‌లకు మీ సందర్శన, మిమ్మల్ని మా వెబ్‌సైట్‌లకు దారి మళ్లించిన ఇతర వెబ్‌సైట్‌ల వివరాలు, మా ఆన్‌లైన్ అడ్వర్టైజ్మెంట్‌లు మరియు మీరు సందర్శించిన పేజీలకు మీ ప్రతిస్పందనలు వంటి సమాచారాన్ని ఇవి రికార్డ్ చేస్తాయి, తద్వారా మీకు లేదా ఇతర సంభావ్య కస్టమర్‌లకు ఎందులో ఆసక్తి ఉందో ఆ కమ్యూనికేషన్‌లు, ఉత్పత్తులు మరియు సేవల గురించి మేము మరియు మా భాగస్వాములు అంతర్దృష్టులను పొందగలము.
మీకు మరియు మీ ఆసక్తులకు సంబంధించినదిగా ఉండే సమాచారాన్ని మీతో కమ్యూనికేట్ చేయడం కోసం మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతల ప్రొఫైల్‌ను రూపొందించడం కోసం ఈ అంతర్దృష్టులను పొందడానికి, కొన్నిసార్లు మేము మీ వ్యక్తిగత డేటాను విశ్లేషించవచ్చు. అంతర్గత మరియు బాహ్య మూడవ-పక్ష వనరుల నుంచి మీ గురించి అందుబాటులో ఉన్న అదనపు సమాచారాన్ని కూడా మేము ఉపయోగించుకోవచ్చు.
ఈ కుకీలు సేకరించే సమాచారాన్ని మేము ఈ క్రింది వాటి కోసం ఉపయోగిస్తాము:
- మా అడ్వర్టైజ్మెంట్‌లు లేదా ఆఫర్‌లను మీకు అనుగుణంగా రూపొందించడానికి (సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు లేదా ఇతరములు వంటివి, మా లేదా మూడవ-పక్ష వెబ్‌సైట్‌ల పై ఉన్న వాటితో సహా)
- మా వెబ్‌సైట్‌లకు మీ గత సందర్శనల ఆధారంగా మా వెబ్‌సైట్‌లను మీ ఆసక్తులకు మరింత సంబంధించినవిగా చేయడానికి
- మా మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్ కార్యకలాపాల ప్రభావాన్ని మూల్యాంకనం చేయడానికి
- మా ఆడియెన్స్‌కు సమానమైన కస్టమర్‌లను గుర్తించడంలో మాకు సహాయపడటానికి
ఈ కుకీలు సేకరించిన డేటాను మీకు నేరుగా మార్కెటింగ్ సందేశాలను పంపించడానికి ఉపయోగించము. అందువలన, ఈ కుకీలను నిలిపివేయడం వలన మీరు మా నుండి మార్కెటింగ్ కమ్యూనికేషన్‌ను అందుకోవడం నిలిచిపోదు. మీరు ఏ సమయంలో అయినా మా నుండి మార్కెటింగ్ మెటీరీయల్‌ను అందుకోకుండా నిలిపివేయగలరు మరియు దీని గురించి మరిన్ని వివరాలను మా ప్రైవసీ పాలసీలో కనుగొనవచ్చు.
మా తరపున మా వెబ్‌సైట్ పై కుకీలను ఉంచే మా మూడవ-పక్ష భాగస్వాములు కేవలం ఈ కుకీలను మాత్రమే అమలు చేస్తారు లేదా ఈ కుకీ పాలసీలో వివరించిన ప్రయోజనాలకు అనుగుణంగా మీ డేటాను దేనినైనా ప్రాసెస్ చేస్తారు.
మోసం నివారణ
పైన పేర్కొన్న కుకీలలో సేకరించిన సమాచారాన్ని మోసం నివారణలో మాకు సహాయపడటానికి కూడా మేము ఉపయోగించవచ్చు అని మేము తెలియజేస్తున్నాము.
మూడవ పక్ష కుకీలు
మీరు మా వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు పైన పేర్కొన్న కుకీలను సెట్ చేయడానికి మేము మూడవ పక్షాలతో కలిసి పని చేస్తాము. ఈ మూడవ పక్షాలలో అడ్వర్టైజర్‌లు, సెర్చ్ ఇంజన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, లేదా అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి మా భాగస్వాములు మరియు సేవా ప్రదాతలు ఉంటారు, మా వెబ్‌సైట్‌ల పై మీ అనుభవాలను మెరుగపరచడానికి మరియు వ్యక్తిగతీకరించడానికి మరియు మీకు సంబంధించే కంటెంట్‌ను అందించడానికి ఇవి మమ్మల్ని అనుమతిస్తాయి.
మిమ్మల్ని గుర్తించగల ఎలాంటి డేటాను మేము ఈ మూడవ పక్షాలతో పంచుకోము.
మాకు చెందని ఇతర వెబ్‌సైట్‌లను మీరు సందర్శించినప్పుడు మూడవ పక్షాలు మీ పరికరం పై కుకీలను కూడా ఉంచవచ్చు. ఈ కుకీలు మూడవ పక్ష కుకీ పాలసీలకు అనుగుణంగా అమలు చేయబడతాయి, వీటి పై మాకు నియంత్రణ ఉండదు. మీరు ఎల్లప్పుడూ మీ బ్రౌజర్ సెట్టింగ్‌ల ద్వారా మూడవ పక్షాల కుకీల నుండి వైదొలగవచ్చు.
కుకీలను నిర్వహించడం
మీ బ్రౌజర్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా మీరు కుకీలను నిలిపివేయవచ్చు. చాలా వెబ్ బ్రౌజర్‌లు ప్రారంభంలో కుకీలను అంగీకరించేలా సెట్ చేయబడతాయి. ఈ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా, చాలా సందర్భాలలో మీరు కుకీలను లేదా మూడవ పక్ష కుకీలను అంగీకరించకుండా ఉండటాన్ని ఎంచుకోవచ్చు.
మీ బ్రౌజర్ సెట్టింగ్‌లలో కుకీలను తొలగించడం అంటే ఒక వెబ్‌సైట్ పై మీరు చేసిన ప్రాధాన్యతల సెట్టింగ్‌లను కోల్పోవడం (అందుబ ఉన్నచోట కుకీలకు సంబంధించి ఏవైనా అంగీకార ప్రాధాన్యతలతో సహా).
కుకీలను అన్నిటినీ బ్లాక్ చేయడం అంటే పైన వివరించినట్లుగా మా వెబ్‌సైట్‌ల సామర్ధ్యాన్ని కోల్పోవడం అని దయచేసి గమనించండి. మా వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కుకీలను అన్నిటినీ నిలిపివేయడాన్ని మేము సిఫార్సు చేయము.
ఈ ప్రముఖ బ్రౌజర్‌లలో మీ కుకీ సెట్టింగ్‌లను నిర్వహించడం పై మరింత సమాచారం కోసం క్రింద చూడండి:
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్: https://support.microsoft.com/en-us/help/17442/windows-internet-explorer-delete-manage-cookies
ఫైర్‌ఫాక్స్: https://support.mozilla.org/en-US/kb/cookies-information-websites-store-on-your-computer
గూగుల్ క్రోమ్: https://support.google.com/chrome/answer/95647?hl=en
సఫారీ: https://support.apple.com/en-sg/guide/safari/sfri11471/mac
గూగుల్ యాడ్ సెట్టింగ్స్ను సందర్శించడం ద్వారా, గూగుల్ కుకీలను (డబుల్‌క్లిక్ కుకీలతో సహా) ఉపయోగించడాన్ని నిలిపివేయవచ్చు. అలాగే ఫేస్‌బుక్ యాడ్ సెట్టింగ్స్ను సందర్శించడం ద్వారా ఫేస్‌బుక్ పిక్సెల్ సమాచార వినియోగాన్ని, లింక్డ్ఇన్ సెట్టింగ్స్ను సందర్శించడం ద్వారా లింక్డ్ఇన్ కుకీల వినియోగాన్ని, మరియు అడోబ్ సెట్టింగ్స్ను సందర్శించడం ద్వారా అడోబ్ కుకీల వినియోగాన్ని నిలిపివేయవచ్చు.
ఆన్‌లైన్ యాడ్స్ కోసం మీ ప్రాధాన్యతలను పరిశీలించేందుకు మరియు ఎంచుకునేందుకు మీరు ఈ క్రింది సైట్‌లను కూడా సందర్శించవచ్చు.
డిజిటల్ అడ్వర్టైజింగ్ అలయెన్స్